AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు నాగచైతన్య–శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం!.. నెట్టింట జోరుగా ప్రచారం

అక్కినేని వారింట పెళ్లి బాజాలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
నిజమేనా..? అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయా.. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య మరో పెళ్లికి సిద్ధమయ్యారా..? అవునని.. నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరో చైతూ ఓ హీరోయిన్‌తో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారని, వారిద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం విదితమే. నటి శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ జరుగనుందనీ.. అది కూడా గురువారమేనంటూ ఓ వార్త వైరలవుతున్నది. కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకోనున్నారని, త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన చేయనున్నారని కొన్ని ప్రధాన వెబ్‌సైట్లు కూడా ప్రచురించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయమే తెలియాల్సి ఉన్నది.

చైతూ–శోభిత డేటింగ్‌!
2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అప్పటినుంచే చైతూ–శోభిత జంటపై రూమర్స్‌ వచ్చాయ్‌. ఇద్దరు లవ్‌లో పడ్డారని, డేటింగ్‌ చేస్తున్నట్టు కూడా చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్‌ పిక్స్‌ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థమే అంటూ ప్రచారం జరగడంతో ఆంతా ఆసక్తిగా మారింది.

తేనాలికి చెందిన శోభితా..
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన శోభితా.. ముంబై యూనివర్సిటీ, హెచ్‌ఆర్‌ కాలేజీలో కామర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ పూర్తిచేశారు. 2013లో మిస్‌ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. అనంతరం సినీరంగంలోకి ప్రవేశించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్‌ సినిమాల్లో కనిపించింది. ఇక పొన్నియన్‌ సెల్వన్, ది నైట్‌ మేనేజర్‌ 2, కురుప్‌ కీలక పాత్రలు పోషించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10