(అమ్మన్యూస్, హైదరాబాద్):
నటుడు బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రై మ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేసారని బిత్తిరి సత్తిపై వానరసేన ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రై మ్ పోలీసులు. బిత్తిరి సత్తి అసలు పేరు రవి. ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా చేసిన బిత్తిరి సత్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాతసొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని.. వినోదకర వీడియోలు తీస్తున్నారు. సినిమా ప్రమోషన్స్, బిజినెస్ ప్రమోషన్స్ చేసుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్న సత్తికి ఇప్పుడు చుక్కెదురైంది. ఆయన ఇటీవల చేసిన వీడియో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై బిత్తిరి సత్తి ఎలాస్పందిస్తారో వేచి చూడాలి.
