ఆగస్టు 14 నుంచి నామినేషన్లు
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్ 3న ఎన్నిక జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది.