AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓయో రూమ్లపై పోలీసుల మెరుపు దాడులు..

హైదరాబాద్‌: కేపీహెచ్బీలోని (KPHB) పలు ఓయో రూమ్లపై (Oyo Rooms) బాలానగర్ ఎస్వోటీ పోలీసులు (Balanagar SOT Police) దాడులు చేశారు. 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. కొన్ని రూమ్స్‌లో ప్యాకెట్ల కొద్దీ కండోమ్స్ కనిపించడం గమనార్హం. పబ్‌లు, లాడ్జీలపై (Pubs, Lodges) పోలీసుల నజర్‌ పెరడగంతో జల్సా రాయుళ్లు రూటు మార్చారు. నగర శివార్లలో ఉండే గెస్ట్‌, ఫాంహౌసులు, ఓయో రూములను అడ్డాగా మార్చుకొని పేకాట, హుక్కా, మద్యం సేవించడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు ఓయో రూములు, లాడ్జీలు, ఫామ్‌హౌసులు, పబ్‌లు, దాబాలపై మెరుపుదాడులు నిర్వహిస్తూ చెమటలు పట్టిస్తున్నారు.

సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు (Cyberabad SOT Police) గత శనివారం రాత్రి కూడా 8 ఓయో లాడ్జీలు, 11 ఫామ్‌హౌస్‌లు, 6 పబ్‌లు, 14 దాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో పాటు నిర్వాహకులను కూడా అరెస్ట్‌ చేశారు. పేట్‌ బషీరాబాద్‌లోని లక్ష్మీ విల్లా గెస్ట్‌హౌస్‌లో గంజాయి సేవిస్తున్న పలువురిని గుర్తించి వారితో పాటు నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.

ANN TOP 10