AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం.. 16గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. ఈ క్రమంలో జలాశయాలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు పొంగి పారుతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు భారీ వరద పోటెత్తడం జరుగుతుంది. నాగార్జున సాగర్ డ్యామ్‌కు సైతం వరద పోటెత్తుతున్నది. జలాశయంలో నీటిమట్టం గరిష్ఠానికి చేరడంతో అధికారులను గేట్లు ఎత్తివేశారు. ఎగువన శ్రీశైలం డ్యామ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేసి 4లక్షలకుపైగా వరద దిగువనకు వదులుతున్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి నీట్టిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 584.40 అడుగులు ఉన్నది. ప్రస్తుతం జలాశయంలో 295.70 టీఎంసీలుగా ఉన్నది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో సాగర్‌ ఇన్‌ఫ్లో 3,23,969 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో 1,63,691 క్యూసెక్కులుగా ఉన్నది. రైట్‌ కెనాల్‌కు 8,529 క్యూసెక్కులు, లెఫ్ట్‌ కెనాల్‌కు 4613 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌ ద్వారా 28,501 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ (ఏఆర్‌ఎంపీ) 1800 క్యూసెక్కులు, ఎల్‌ఎల్‌సీకి 600 క్యూసెక్కులు, క్రస్ట్‌ గేట్ల ద్వారా 1,48,149 క్యూసెక్కులు వరదను దిగువకు వెళ్తున్నది.

ANN TOP 10