AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షేక్‌ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ భేటీ

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్‌ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనాకు ధోవల్‌, ఆర్మీ అధికారులు రిసీవ్‌ చేసుకున్నారు.

షేక్‌ హసీనాకు భారత వైమానిక దళంతోపాటు ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పించనున్నాయి. ప్రస్తుతం ఆమెకు సురక్షితమైన ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. హిండన్ ఎయిర్‌బేస్‌లో అజిత్‌ ధోవల్‌, మిలిటరీ అధికారులతో హసీనా మాట్లాడారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి, హసీనా భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

బంగ్లాదేశ్‌లో పరిస్థితి నేపథ్యంలో తూర్పున ఉన్న ప్రతి సెక్టార్‌లో మిలిటరీ అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 300 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో బంగ్లా మిలిటరీ సలహా మేరకు హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ఆమె లండన్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ANN TOP 10