తన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లోకి
అన్ని వేళలా అందుబాటులో ఉండే అందరివాడు
పట్టు వదలని విక్రమార్కుడు.. నమ్ముకున్న వారికి అండాదండ
కంది అణచివేస్తే ఆగిపోడు కుతంత్రాలకు కుంగిపోడు
విజయం సాధించేదాకా విశ్రమించని ధీరుడు
కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పాలిటిక్స్ లో పెను తుఫాన్. సేవే లక్ష్యంగా తను పుట్టిన పెరిగిన ప్రాంత ప్రగతి కోసం తపన పడే నిఖార్సయిన ప్రగతిశీలి. ఆయన ఆకలితో ఉన్న వారికి అన్నం ముద్ద. పేదలకు అండాదండ. నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా నిలబడే నాయకుడు. తనపై ఎన్ని దాడులు జరిగినా దడవని షేర్. రాజకీయాల్లోకి వచ్చిన ఏ యువనాయకుడు కంది శ్రీనివాసరెడ్డిలా దాడులు, కుట్రలను ఎదుర్కోలేదు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. నేను,నా ఆదిలాబాద్ అంటూ ప్రజల కోసమే పరితపించే నిఖార్సయిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. ఆయన కార్యాలయమే ప్రజాసేవాభవన్. మూడేళ్ళుగా పేద ప్రజలు, సాయం ఆశించి వచ్చే జనలతో ఆ కార్యాలయం కళకళలాడుతూనే ఉంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడినా లోక్ సభ ఎన్నికల నాటికి వలసలతో పార్టీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు. ప్రతికూల వాతావరణానికి ఎదురునిలిచి ఫలితాలు సాధించడం కంది శ్రీనివాసరెడ్డికి మాత్రమే సాధ్యం. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్. ప్రత్యర్ధుల దాడులతో రాటుదేలి రాజకీయ రంగంలో మరింత స్థిరపడ్డ కంది శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా అమ్మన్యూస్ డిజిటల్ ప్రత్యేక కథనం
…………….
కంది శ్రీనివాస రెడ్డి… పేదల పెన్నిధి. ఆదిలాబాద్ జిల్లాలో అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందిన రాజకీయ నాయకుడు. ఒక సాధారణ పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సామాన్యుడు నేడు జిల్లా వాసుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడంటే దాని వెనుక ఆయన సేవాభావం, మానవత్వం, ఉదారత, అన్నింటికి మించి అందరూ తనవాళ్లు అనుకునే మంచితనం కనిపిస్తుంది. అందుకే ఆదిలాబాద్ నియోజక వర్గ ప్రజలకు ఆయన ఆప్తుడయ్యాడు.. ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడయ్యాడు.ఇవాళ కంది శ్రీనివాస రెడ్డి జన్మదినం సందర్భంగా అమ్మన్యూస్ ప్రత్యేక కథనం.
ఇంతింతై..
ఆదిలాబాద్ ముద్దు బిడ్డ కంది శ్రీనివాస రెడ్డి. కంది అనసూయ, కిష్టారెడ్డి దంపతుల తొలి సంతానం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కేఎస్ఆర్ బాల్యమంతా ఆదిలాబాద్ లోనే గడిచింది. చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే కంది శ్రీనివాసరెడ్డి కాగజ్ నగర్ జవహర్ నవోదయలో ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. అనంతరం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివి పట్టా పొందారు. ఆ తరువాత పై చదువుల కోసం విదేశాలలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీట్ సాధించి స్వయం కృషితో రాణించి అంచెలంచెలుగా ఎదిగారు. అద్వితీయం.. అసాధరణంగా ఆదిలాబాద్ రైతు బిడ్డ కంది శ్రీనివాస రెడ్డి అమెరికా ప్రస్థానంలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత ఆర్టిఫింట్ టెక్నాలజీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించారు. వందలాది మందికి ప్రత్యక్షంగా.. వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించారు. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వంలో సిటీ ఆఫ్ సాన్ డియెగో లాంటి అమెరికాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన అతికొద్దిమంది భారతీయుల్ కంది శ్రీనివాస రెడ్డి ఒకరు. అమెరికాలోని లెనోవో లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్స్ ఉత్పత్తి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. వ్యాపార ప్రస్థానం కంది శ్రీనివాసరెడ్డికి చిన్నప్పటినుండి పట్టుదల ఎక్కువ. ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదలని తత్వం ఆయనది. అదే పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, ఆయనను లక్ష్య సాధన దిశగా నడిపించింది. ధనమూలమిదం జగత్.. దేనికైనా డబ్బు కావాలనే సూత్రంతో… పేదరికంలో పుట్టిన కేఎస్ఆర్‌లో ఎదగాలన్న తపనకు బీజం పడింది. మారుమూల వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి అమెరికాకు పయనమయ్యేలా చేసింది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం నిర్విరామ శ్రమ, అకుంఠిత దీక్షా దక్షతలతో కంపెనీల స్థాపన వరకు చేరింది. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఒక్కో సంస్థ నెలకొల్పుతూ అనతి కాలంలోనే అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో 14 సాఫ్ట్ వేర్ కంపెనీలు స్థాపించాడంటే అతని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలోనే కాకుండా తన మాతృభూమిలో కూడా పలు కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా సాప్ట్‌వేర్ కంపెనీ స్థాపించి ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదొక్కటే కాదు తనకు జన్మనిచ్చిన నేలతల్లి ఋణం తీర్చుకునేందుకు విదేశాలలో ఉన్నప్పుడే.. ఆదిలాబాద్‌లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని జిల్లా వాసుల ప్రయోజనాలకు కేటాయించాలన్న తాపత్రయం ఆయనది. నేను నా కుటుంబం అనే స్వార్ధం లేకుండా సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన కేఎస్ఆర్‌ది. సామాజిక సేవను విస్తృతపరిచేందుకు కెఎస్ఆర్ ఫౌండేషన్ నెలకొల్పి తద్వారా జిల్లాలో లెక్కకు మించి సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆప్తబంధుగా మారింది. సేవలకు అంకురం తను పుట్టి పెరిగిన ఊళ్లో పాఠశాల విద్యార్ధులకు భోజన ప్లేట్స్, గ్లాసులు అందించడంతో ఆయన సేవా ప్రస్థానం మొదలైంది. ఆ తరువాత బాలవికాస్ సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్, ఎండా, వానలకు ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి బస్ షెల్టర్ నిర్మించారు. ఇక జైనథ్ మండలం జామిని గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఆదివాసి రైతు కుటుంబానికి తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల చదువుకు పూర్తి భరోసా ఇచ్చి జిల్లాలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఆరోజు ఆయనను ప్రత్యక్షంగా చూడటానికొచ్చిన వేలాది మందితో జామిని జనసంద్రాన్ని తలపించింది. తొలిసారిగా అయనను చూసి ఆయన మాటలు విన్న ప్రజలకు ఒక భరోసా కలిగింది. ఇక అప్పటి నుండి సేవా కార్యక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. అంతేకాకుండా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజేతలకు నగదు పురస్కారాలు బహుకరించారు.
కంది శ్రీనివాస రెడ్డి ఒక భరోసా ఇక కెఎస్ఆర్ ఫౌండేషన్ అంటే ఓ నమ్మకం ఓ భరోసా అని ఆదిలాబాద్ ప్రజల గుండెల్లో పాతుకుపోయింది. ఇదే జిల్లా ప్రజల పట్ల కంది శ్రీనివాసరెడ్డికున్న పట్టింపునకు నిబద్దతకు ఓ నిలువుటద్దం. ఎందుకంటే సేవే మార్గంగా మార్పే లక్ష్యంగా అన్నీ వదులుకొని ఖండాంతరాలు దాటి పుట్టి పెరిగిన జిల్లాకు ఏదైనా మంచి చేద్దామని వచ్చిన మహామనిషి కంది శ్రీనివాసరెడ్డి. పట్టణంలో ప్రజల కోసం ప్రజా సేవాభవన్ ను స్థాపించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. దాని ఆవరణలోనే మూడేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఉచిత నిత్నాన్నదానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క పూట భోజనం గురించి లెక్కలు వేసే ఈ రోజుల్లో మూడేళ్లుగా ప్రతీరోజూ వందలాది మందికి అన్నం పెడుతున్నాడంటే అతని మంచి తనం అర్ధమవుతుంది. పేదల ఆకలి తీర్చడంలో ఎంతో తృప్తి ఉందని అలాంటి శక్తి భగవంతుడు తనకివ్వడం అదృష్టమంటారు కంది శ్రీనివాస రెడ్డి. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రంలో రోజూ వందలాది మంది తమ ఆకలి తీర్చుకుంటారు. తమకోసం దేవుడు పంపిన దూత అని కొనియాడుతుంటారు. అన్నంపెట్టే అన్నదాత కంది శ్రీనివాస రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. సేవలు ..ప్రశంసలు అటు ఆయన సేవా దృక్పథం నుండి పుట్టుకొచ్చినవే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ప్రాణదాత ఆంబులెన్స్ లు. అత్యవసరంలో ఆపన్న హస్తం అందించి ప్రాణాలను నిలబెడుతోంది కెఎస్ ఆర్ ఫౌండేషన్. ప్రాణదాత ఆంబులెన్స్. ఇప్పటివరకు వందలాది మందిని ఆస్పత్రులకు చేర్చి వారి ప్రాణాలకు రక్షణగా నిలిచాయి ప్రాణదాత ఆంబులెన్స్ లు. జిల్లాలో నిరంతరం పని చేస్తూ ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ రోగులను ఆదుకుంటున్నాయి. మరోవైపు వివాహాది శుభకార్యాలకు ప్రేమగా ఆహ్వానించిన వారి ఇంటి వేడుకలకు ఉట్టి చేతులతో హాజరుకాకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంది శ్రీనన్న పెళ్లికానుక కిట్లను బహుకరిస్తూ ఆయా కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. మండు వేసవిలో గుక్కెడు నీటికోసం అల్లాడుతున్న వారికి అపర భగీరథుడిలా కనిపించారు కంది శ్రీనివాస రెడ్డి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తన స్వంత డబ్బుతో ప్రతీ రోజు రెండు పూటలా మంచి నీటి ట్యాంకర్లు పంపించి వారి దాహార్తిని తీర్చిన గొప్ప మనిషి కంది శ్రీనివాసరెడ్డి బాధితులకు అండగా.. అంతేకాక కుటుంబ పెద్దలను, ఆప్తులను కోల్పోయి విచారంలో ఉన్న కుటుంబాలను కలిసి పరామర్శిస్తారు. ఆయా కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా సంపాదించే పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్దిక సాయమందిస్తారు. ఆదివాసీ గూడాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారు. కష్టాల్లోవారికి అండగా ఉంటానని భరోసానిస్తారు. ప్రజలకు ఏ కష్ట మొచ్చినా కంది శ్రీనన్న ఉన్నాడన్న భరోసా వారికిచ్చారు. రాజకీయ ప్రస్థానం కంది శ్రీనివాస రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీ తో మొదలైనా సెక్యూలర్ భావాలు ఉండటంతో… కమలం పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక సమయంలో ఆదిలాబాద్‌లో బలహీనంగా ఉన్న హస్తం పార్టీ.. ఇప్పుడు కంది శ్రీనన్న ఎంట్రీతో పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగి పూర్తిగా బలోపేతమయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతుంటారు.అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ పై పోటీ చేసి కొందరి ద్రోహం కారణంగా ఓడిపోయినా గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి కూడా రానన్ని ఓట్లు, ఓటింగ్ శాతాన్ని సాధించారు కంది శీనన్న. అంతే కాకుండా ఓడినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల క్షేమం కోసం జనం బాట పట్టారు. తన ఓటమికి ఎవరు నిరాశ పడవద్దని శ్రేణుల్లో ధైర్యం నింపారు. తాను ఓడినా గెలిచినా ప్రజల మనిషినని, ప్రజలే తనకు సర్వస్వమన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని ప్రజలకు హామీ ఇచ్చారు.
మీతోనే ఉంటా
ఇక్కడే ఉంటా.. మీతోనే ఉంటా.. మీలో ఒకడిగా ఉంటానని ఆయనప చెబుతున్న మాటలు ఇటు పార్టీ శ్రేణుల్లో అటు ప్రజల్లో కొండంత భరోసా కల్పిస్తున్నాయి. అనంతరం వచ్చిన లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ ఎంపీ అభ్యర్ధితో కలిసి నియోజక వర్గంలో విస్తృత ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయినా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తన నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లను సాధించిపెట్టారు. అసెంబ్లీ నుండి పార్లమెంట్ ఎన్నికల సమయానికి పార్టీని మరింత బలోపేతం చేశారు. ప్రజల కోసం పట్టణంలో ఆయన స్థాపించిన ప్రజా సేవాభవన్ ఎల్లప్పుడూ కార్యకర్తలు అభిమానులతో సందడిగా ఉంటుంది. నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తనవంతుగా సాయం చేస్తుంటారు. అంతే కాకుండా తన ఫౌండేషన్ సిబ్బందితో ఇటు క్యాంపు ఆఫీస్ అటు రిమ్స్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారంటే ప్రజల సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు కంది శ్రీనన్న అంటే మావాడంటారు. మాకు ఆప్తుడంటారు. మాలో ఒకడంటారు. అదీ ప్రజల్లో కంది శ్రీనివాస రెడ్డికున్న క్రేజ్. వన్స్ మోర్ హ్యాపీ బర్త్ డే సర్ ఓడిపోతే పారిపోడు,అణచివేస్తే ఆగిపోడు,పొగడ్తలకు పొంగడు,కుతంత్రాలకు కుంగడు అందుకే కంది శ్రీనన్న నిజమైన నాయకుడు. ఆయన చేసే ప్రతీ పనిలో ఏకాగ్రత, మాట్లాడే ప్రతీమాటలో నిజాయితీ, ప్రతీ చర్యలో క్రమశిక్షణ, ప్రతీ ఆలోచణలో ధృఢసంకల్పం ఇవి కంది శ్రీనివాస రెడ్డి అస్త్రాలు.. ఆయన విజయాలకు సోపానాలు. ఆరడుగుల మానవతామూర్తి కంది శ్రీనివాసరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు.
………..