జీఎస్టీ లెక్కల్లో తేడాలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కిరణ్ కుమార్ అని పిలవబడే లలితా జ్యువెలరీ అధినేతకు నోటీసులు జారీ అయ్యాయి. జీఎస్టీ లెక్కల్లో చాలా తేడాలు ఉండటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. టీవీ పెట్టగానే గుండుతో ఉన్న ఓ వ్యక్తి వచ్చి తమ నగలను కొనిచూడండి తేడా మీరే గమనించండి..పక్క షాపులో నగలతో కంపేర్ చేసుకోండి.. డబ్బులు ఊరికే రావు అంటూ క్లాసులు పీకే యాడ్ గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరు. తన సంస్థకు తానే బ్రాండ్ గా మారాడు. చూడటానికి కామెడీగా ఉన్నా జనం కూడా బాగా ఈయన యాడ్స్ కు అలవాటు పడ్డారు. యాడ్ చివర్లో డబ్బులు ఊరికే ఎవరికీ రావు అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ప్రతి ఒక్కరి నోళ్లలో నానింది.
చిక్కుల్లో కిరణ్‌కుమార్..
కిరణ్ కుమార్ అని పిలవబడే లలితా జ్యువెలరీ అధినేత పాపం చిక్కుల్లో పడ్డారు. అందరినీ పక్క షాపులో కంపేర్ చేసుకోండని చెప్పే ఈయన తన సొంత విషయంలో మాత్రం తప్పులో కాలేశారు. కేంద్రానికి సమర్పించే జీఎస్టీ లెక్కలలో చాలా తేడాలు కనిపించాయి. ఆయన సమర్పించిన జీఎస్టీలో అన్నీ తప్పుడు తడకలు ఉన్నట్లు అధికారులు తేల్చిపారేశారు. పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న లలితా జ్యువెలరీ షాప్ కు సంబంధించిన ఆడిట్ లో తనకు రావసిన జీఎస్టీ ద్వారా యాభై ఆరు కోట్ల మేరకు క్లయిమ్ చేసుకున్నారు. వాస్తవానికి లెక్కల ప్రకారం చూసుకుంటే నలభై ఒక్క కోట్లే రావలసి ఉంది. ఆయనకు రావలసిన సొమ్ముకన్నా అధికంగా పదిహేను కోట్లు ఎక్కువ క్లయిమ్ చేసుకోవడంతో సీటీఓ అధికారులు జీఎస్టీ ద్వారా అయనకు నోటీసులు పంపించారు. దీనితో సోషల్ మీడియాలో లలితా అధినేతపై ప్రజలు ట్రోలింగులు మొదలు పెట్టేశారు.