AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కృష్ణమ్మ పరుగులు.. నిండుకుండలా నాగార్జున సాగర్‌..

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు… సాగర్‌లోకి వచ్చిచేరుతోంది. డ్యామ్‌ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ప్రజెంట్‌ 264 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 34వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తూ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో నాగార్జునసాగర్‌లో 515 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఈసారి 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టానికి గాను.. 573 అడుగులకు చేరింది. 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండడంతో రేపటికల్లా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరే ఛాన్స్ ఉంది. సాగర్‌ గేట్లు తీస్తే అట్నుంచి కృష్ణమ్మ పులిచింతల వైపు పరుగులు పెడుతుంది. ఈ ఏడాది కృష్ణానదికి భారీగా వరద రావడం.. ప్రాజెక్టుకు పూర్తి జలకళ రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వీకెండ్‌ కావడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దాంతో, పది గేట్లను 20 అడుగులమేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీల నీటి నిల్వకు …ఇప్పుడు 200 టీఎంసీల వాటర్‌ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10