AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికాలో రేవంత్‌కు ఘన స్వాగతం

భారీగా తరలివచ్చిన అభిమానులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌ ఎయిర్‌ పోర్టులో అభిమానులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14 వరకు దాదాపు 10రోజులు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానంగా అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు.

పెట్టుబడులే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్‌ వెళ్లారు. ఆయనతోపాటు ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి ఉన్నారు. పర్యటనలో భాగంగా 8 రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం.

ANN TOP 10