AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోస్ట్ పాపులర్ పీఎం మోదీనే.. మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి

ప్రపంచ దేశాధినేతలను వెనక్కి నెట్టి ప్రధాని మోదీ(PM Modi) మరోసారి మోస్ట్ పాపులర్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించగా.. గ్లోబల్‌ డెసిషన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

ఈ సర్వే ప్రకారం 69 శాతం ప్రజల ఆమోదంతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను కూడా మోదీ వెనక్కి నెట్టారు. మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో జులై 7 నుంచి 13 వరకు డేటాను సేకరించి సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. అయితే ఈ సర్వేలో ఆయా దేశాల యువత అభిప్రాయాలే పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.

తరువాతి స్థానాల్లో..

మోదీ తరువాత రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా చిట్టచివరన నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 39 శాతం ప్రజాదరణ లభించింది. అయితే గతంలో కూడా దేశాధినేతలపై పలు సర్వేలు బయటకిరాగా.. వాటిల్లోనూ ప్రధాని మోదీనే అగ్రస్థానంలో నిలిచారు.

టాప్ 5..
నరేంద్ర మోదీని 69 శాతం మంది ఆమోదించగా, 24 శాతం మంది ప్రజలు నిరాకరించారు. 6 శాతం మంది ప్రజలు ఎలాంటి అభిప్రాయం తెలియజేయలేదు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 63 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 60 శాతం రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోలా ఎమ్హార్డ్ 52 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో, ఐర్లాండ్‌కు ప్రధాని సైమన్ హారిస్ 47 శాతం రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10