నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 4.94 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం అవుట్ ఫ్లో 27,238 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 563.60 అడుగులు ఉన్నది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 240.83 టీఎంసీలుగా ఉన్నది.
సాగర్ కుడి కాలువకు 6,324 క్యూసెక్కులు.. ఎడమ కాలువకు 1418, ఎల్‌ఎల్‌బీసీ (ఏఆర్‌ఎంపీ)కి మరో 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో వైపు జూరాల ప్రియ దర్శణి డ్యామ్‌కు సైతం వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 2.90లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయం నుంచి 2,66,192 వరదను దిగువకు వదులుతున్నారు. స్పిల్‌వే నుంచి 2,45,750 క్యూసెక్కులు, పవర్‌హౌస్ నుంచి 17,782 క్యూసెక్కులు విడుదలవుతున్నది. జలాశయం నీటిమట్టం 7.991 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.284 టీఎంసీల నిల్వ ఉన్నది.