సినీ నటుడు రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నటి లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
