అమ్మన్యూస్, మంగపేట:
రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపు లో ఏఎన్ఎం, ఆశావర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ డాక్టర్ పాల్గొన్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర ఆరోగ్య సమస్యల కు మందులు ఇచ్చారు. ఈ హెల్త్ క్యాంపులో షుగర్, మలేరియా, వైరల్, డెంగీ, చీకున్‌గున్యా వంటి వాటికి పరీక్షలు చేస్తారని మొదట చెప్పడంతో రోగులు ఉదయం నుంచి నిరీక్షించారు. మధ్యాహ్నం వేళ డాక్టర్ వచ్చి ఇక్కడ బీపీ మాత్రమే చెక్ చేస్తామని, పరీక్షలు చేయాలంటే బ్రాహ్మణ పల్లికి లేదా చుంచుపల్లికి వెళ్లాలని చెప్పారు. దీంతో రోగులు కొంత అయోమయానికి గురయ్యారు. ‘మేము విష జ్వరాలతో బాధ పడుతుంటే మీరు బ్రాహ్మణపల్లికి వెళ్లండి అంటున్నారు.. అక్కడికి వెళ్తే ఏమి లేవు చుంచుపల్లికివెళ్లాలని అంటున్నారని రోగులు వాపోయారు. ఇదేమి హెల్త్ క్యాంపు అంటూ రోగులు వెళ్లిపోయారు.
