AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయమ్మతో జేసీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం

వైఎస్‌ జగన్, షర్మిల మధ్య రాజీ కుదిర్చేందుకేనా?

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఈ భేటీయే నిదర్శనం. టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో వైఎస్‌ విజయమ్మను కలిశారు. జగన్‌ అంటే ఒంటికాలిపై లేస్తారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. జగన్‌ ప్రభుత్వం హయాంలో ఆయనను ఇబ్బందిపెట్టడమేకాదు వ్యాపారాలకు సైతం చెక్‌ పెట్టారు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పనై పోయిందని భావించారు. టీడీపీ అధికారంలోకి రావడంలో మళ్లీ యాక్టివ్‌ అయ్యారు.

విజయమ్మ ఆరోగ్యంపై ఆరా..
హైదరాబాద్‌ తన అన్న జేసీ దివాకర్‌రెడ్డి వద్దకు వచ్చారు ప్రభాకర్‌రెడ్డి. మరి ఏమైందో తెలియదుగానీ నేరుగా వెళ్లి వైఎస్‌ విజయమ్మను కలిశారాయన. దాదాపు అరగంటపాటు చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, జగన్‌– షర్మిల మధ్య రాజీ అంశంపై చర్చించినట్టు సమాచారం. రాజకీయాలు లేవని, కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చారన్నది జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట.

రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..
కారణాలు ఏమైనా కావచ్చు.. సడన్‌గా విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విజయమ్మతో భేటీ మర్యాద పూర్వకంగానే జరిగిందా? లేక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? ఇవే ప్రశ్నలు అధికార–విపక్షాలను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అంతర్గతంగా ఏమి జరిగిందనేది ఎలాంటి సమాచారం బయటకురాలేదు. కేవలం ఫొటో మాత్రమే బయటకు వచ్చింది.

రాజకీయాల పరంగా విజయమ్మ ఇప్పటికే తన కూతురు షర్మిల వైపు మొగ్గుచూపారు. కొడుకు జగన్‌ను పక్కనపెట్టి ఓపెన్‌గా కూతురికి సపోర్టు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సమయంలో విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి సమావేశం కావడం ఏపీ అంతటా చర్చ మొదలైంది.

ANN TOP 10