AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారి గురించి మాట్లాడకపోవడమే బెటర్‌.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితం
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వెంకట్‌రెడ్డి దంపతులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన కామెంట్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆషాఢం బోనాల సందర్భంగా ఆదివారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమృద్ధిగా వర్షాలు పడి రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోలేదని, కాంగ్రెస్‌ కుట్ర పన్నుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయన్న కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని సెటైర్‌ వేశారు. కేటీఆర్‌ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్‌ భూమి లోపలకి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. కేటీఆర్‌ విమర్శలకు సమాధానం చెబితే పండగ రోజు వాతావరణం పాడవుతుందని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసినా భవిష్యత్‌లో మూడు బ్యారేజీలు ఉంటాయని గ్యారంటీ లేదని ఎన్డీఎస్‌ రిపోర్టు ఇచ్చిందని ఆ రిపోర్టును కేటీఆర్‌ కు తాను పంపిస్తానన్నారు.

ANN TOP 10