AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైపాల్‌రెడ్డి ఆదర్శనీయుడు.. సీఎం రేవంత్‌ రెడ్డి .. స్ఫూర్తి స్థల్‌ వద్ద ఘన నివాళి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌ వద్ద జైపాల్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. జైపాల్‌ రెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో జైపాల్‌ రెడ్డి పాత్ర మరవలేమని పేర్కొన్నారు. జైపాల్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

కుటుంబ సభ్యులతో కలిసి..
కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి 5వ వర్ధంతిని కుటుంబ సభ్యులతో కలిసి స్ఫూర్తి స్థల్‌ లో నివాళులర్పించారు. ఆయనతోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రాపాలి, జైపాల్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ANN TOP 10