AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోనమెత్తిన పాతబస్తీ.. ఘనంగా లాల్‌దర్వాజా బోనాలు

భాగ్యనగరంలో అంబరాన్నంటిన బోనాల సంబరాలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో లాల్‌దర్వాజ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి. క్యూలైన్లలో భారీగా భక్తులు తమ వంతుకోసం వేచిఉన్నారు. అలాగే ఈ ఏడాది లాల్‌ దర్వాజా 116 వ వార్షికోత్సవ వేడుకలు చేపడుతున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కలు సమర్పిస్తున్నారు. బోనాల కార్యక్రమం సజావుగా సాగేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. 500 కు పైగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారికి..
చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇక అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొన్నది. పంజాగుట్టలోని దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతున్నది. దుర్గా భవాని అమ్మవారిని, దక్షిణామూర్తి స్వామివారిని కూరగాయలతో అందంగా అలంకరించారు.

ANN TOP 10