AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ.. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. జిష్ణుదేవ్‌ వర్మ తెలంగాణ గవర్నర్‌గా, హరిబౌ కిషన్‌ రావు బాగ్డే రాజస్థాన్‌గా గవర్నర్‌గా, ఓమ్‌ ప్రకాశ్‌ మాథూర్‌ సిక్కిం గవర్నర్‌గా, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ జార్ఖండ్‌ గవర్నర్‌గా, రామెన్‌ దేకా ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా, సీహెచ్‌ విజయ్‌ శంకర్‌ మేఘాలయా గవర్నగా నియమితులయ్యారు.

సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్ర గవర్నర్‌గా..
తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్ర గవర్నర్‌గా, అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్‌ చంద్‌ కటారియా పంజాబ్‌ గవర్నర్‌గా, చంఢీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యకు మణిపూర్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి..
త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన జిష్ణుదేవ్‌ వర్మ.. తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్‌చార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018–23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10