చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసం తిరుపతి పోలీసులు కొంతకాలంగా గాలిస్తున్నారు. బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న తిరుపతి పోలీసులు శనివారం బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారని వెలుగు చూసింది.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు హజరుపరచడానికి పోలీసులు సిద్దం అయ్యారు. మూడు రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి అనుచుడి కోసం వేట, ఆర్డీఓలు తెలీదు అనే సినిమా డైలాగులు మే 14వ తేదీన తిరుపతిలోని శ్రీ పద్మావతి మమిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడానికి పులివర్తి నాని వెళ్లారు. ఆ సమయంలో కొందరు పులివర్తి నాని మీద ఇనుపరాడ్లు, సుత్తులు, బీరు బాటిల్స్ తో దాడి చెశారు. ఈ దాడుల్లో పులివర్తి నాని గన్ మెన్ కు తీవ్రగాయాలైనాయి, పులివర్తి నానికి కూడా గాయాలు అయ్యాయి. ఈ విషయంపై అప్పట్లో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయ్యింది.
ఈ కేసుకు సంబంధించి అప్పటి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు 13 మందిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివర్తి నాని మీద హత్యాయత్నం చేశారని నమోదు అయిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.