AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు.. బయటివాళ్లేవరూ అవసరం లేదు.. వాళ్లలో వాళ్లే కొట్టుకుని చివరికి సర్కారును కూల్చేసుకుంటారంటూ ప్రతిపక్షాలు ఎన్నో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ.. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే.. అసెంబ్లీలో తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇందులో అభివృద్ధికి, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యం ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సభలో వాడీ వేడిగా చర్చ నడించింది. ఈ చర్చ అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.

తెలంగాణలో రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఏదో ఐదేళ్లు అలా ఇలా గడిపేయడానికి తాము అధికారంలోకి రాలేదని.. తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం ఈ ఏడాది నుంచే ఇస్తామని భట్టి స్పష్టం చేశారు. త్వరలోనే స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నామని.. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశామని భట్టి విక్రమార్క వివరించారు.

దేశం గర్వించేలా తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ పాఠశాలలను తీసుకొస్తామని.. 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో విశాలంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మించనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులు తయారవ్వాలని భట్టి ఆకాంక్షించారు. తెలంగాణ నూతన విద్యా విధానం దేశానికి ఆదర్శం కాబోతుందని తెలిపారు. తమ గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. రాష్ట్రానికి ఏం చేసిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10