ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. నేటి నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, 27, 28 తేదీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో పెంచనున్న సీట్లు నేడు లేదా రేపు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రోజుల్లోనే కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
