తెలంగాణ అసెంబ్లీలో గురువారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ఈ రాత్రి ప్రజాప్రతినిధులకు, ఆర్థిక శాఖ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో రూ. 2,91,159 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నెలలో లోక్‌సభ ఎన్నికల ముంగిట మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రప్రభుత్వం.. ఇవాళ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతుభరోసా, సంక్షేమ రంగాలకు సింహభాగం నిధులను కేటాయించారు. ఇటీవల ప్రకటించిన కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయి చూపారంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హామీల అమలే లక్ష్యంగా రూ. 2 లక్షల 91వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు.