– నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలంటూ ట్వీట్
– సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
సర్వత్రా ఆసక్తి..
ఈ సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలపై పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్, కేటీఆర్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటారు. అలాంటిది పుట్టిన రోజు వేళ రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకోవడంతో ఆసక్తిగా మారింది. కేటీఆర్, రేవంత్ హుందాగా ప్రవర్తిచండంతో ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.