AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎయిడ్స్‌తో నిమిషానికో మరణం.. ఒకే ఏడాదిలో 4 కోట్ల మందికి వైరస్

కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ ఎయిడ్స్ చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ఈ ఎయిడ్స్‌ వ్యాధికి పూర్తిగా మందు లేనప్పటికీ నివారణే ముఖ్యం అని డాక్టర్లు, నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా హెచ్ఐవీపై ఐక్యరాజ్యసమితి నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ సోకి జీవిస్తున్న వారి సంఖ్య 2023 ఏడాది ముగిసే నాటికి దాదాపు 4 కోట్లు అని వెల్లడించింది. ఇక ఈ భయంకరమైన వ్యాధి కారణంగా ప్రతీ నిమిషానికి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది.

అయితే ఈ హెచ్‌ఐవీ సోకిన 4 కోట్ల మందిలో 90 లక్షల మందికి పైగా చికిత్స తీసుకోవడం లేదని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ కారణంగానే ఎయిడ్స్‌ రోగులు ప్రతీ నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు సంచలన విషయాలను వెలువరించింది. మరోవైపు.. 2004 లో 21 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2023 లో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2025 నాటికి ఈ సంఖ్యను 2.5 లక్షలకు తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. హెచ్ఐవీ ఎయిడ్స్‌ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నన్నప్పటికీ.. ఆ రోగాన్ని అరికట్టడంలో మాత్రం అనుకున్న స్థాయిలో ఫలితాలు దక్కకపోవడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మహమ్మారి నిర్మూలనకు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్‌, మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికా లాంటి దేశాలు నిధులు కేటాయిస్తున్నా.. కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ఇక హెచ్‌ఐవీ వైరస్ విజృంభించడం అనేది లింగ అసమానతలకు దారి తీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో టీనేజర్లు, యువతలో ఈ ఎయిడ్స్ వ్యాధి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది సెక్స్‌ వర్కర్లుగా మారడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే ఈ ఎయిడ్స్ మహమ్మారి పెరగడానికి ముఖ్య కారణం అని గుర్తించారు. డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చేసే వ్యక్తుల సంఖ్య 2010 తో పోలిస్తే.. 45 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని పేర్కొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10