ఆలయంలో ప్రత్యేక పూజలు
ముదిరాజ్‌లకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేఎస్ఆర్
ఆదిలాబాద్ : భీమన్న దేవుని ఆశీస్సులతో అందరు సుఖ శాంతులతో ..ప్రతీ ఇల్లూ పాడి పంటలతో కళకళలాడాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి దేవున్ని ప్రార్థించారు. ముదిరాజ్ కులస్తుల కులదైవమైన భీమన్న దేవుని పండగకు ఆయన హాజరయ్యారు.పట్టణంలోని గాంధీ పార్క్ లో గల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం ఈ పండగను మురదిరాజ్ లు ఘనంగా జరుపుకుంటారు. పూజల అనంతరం ముదిరాజ్ కులబాంధవులు ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్, నాయకులు ఓరగంటి రఘు, రాజా లింగన్న, ఎం.ఏ షకీల్, ఎం.ఏ కయ్యుమ్, సింగిరెడ్డి రామ్ రెడ్డి,సోమ ప్రశాంత్, గజ్జల విజయ్, లస్మన్న, మహిళా నాయకురాలు లత, సోనియా ముదిరాజ్ సంఘ సభ్యులు సలేంద్ర శివయ్య,ఓరగంటి శ్రీనివాస్, భూమన్న, పులి నగేష్, బొజ్జ నారాయణ, బొమ్మేని మహేందర్,గొండవేణి గంగన్న,మందుల దాస్,దార్ష రవి,బొజ్జ సంతోష్, సలేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.