అధికారులకు దిశానిర్దేశం
(అమ్మన్యూస్, ములుగు):
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్‌లు జలకళలను సంతరించుకుంటున్నాయి. వరద నీటి తీవ్రతకు పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కాగా, ములుగు జిల్లాలో కురిసిన వర్షాలకు రాళ్లవాగు ప్రవాహానికి బండారు పల్లి వద్ద రహదారి కొట్టుకు పోయింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలసి పరిశీలించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆదేశం..
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనేం దుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఆర్ అండ్ బీ డీఈ. రఘువీర్, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.