మణుగూరు మండలంలో ఘటన
(అమ్మన్యూస్, మణుగూరు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. రామ్మోహన్‌రావు, జోష్ణ అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు మండలంలోని ముత్యాలమ్మ నగర్ వద్ద గ్యాస్ లీక్ కావటంతో కారులో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు గమనించిన స్థానికులు వారిని సమీపంలోని సింగరేణి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, కారు పూర్తిగా దగ్ధమైంది.