AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ కలకలం.. జోరా పబ్‌లో పోలీసుల సోదాలు

నలుగురు అరెస్టు.. విచారణ
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ కలకలం రేపింది. జోరా పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పబ్స్‌ల గురించి చెప్పనక్కర్లేదు. పైకి పబ్‌గా కనిపిస్తు న్నా, రాత్రి వేళ మాత్రం డ్రగ్స్‌ దందా జోరుగా సాగుతోంది. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సినీ సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొన్ని పబ్స్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.

అర్ధరాత్రి వేళ.. వైట్‌ అండ్‌ వైట్‌ ఈవెంట్‌
ఆదివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని జోరాపబ్‌లో వైట్‌ అండ్‌ వైట్‌ ఈవెంట్‌ జరుగుతోంది. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. నార్కోటిక్‌– పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈవెంట్‌ కు వచ్చినవారు డ్రగ్స్‌ తీసుకున్నట్లు సమాచారంతో సోదాలు చేశారు.

నలుగురికి పాజిటివ్‌..
ఈవెంట్‌లో పాల్గొన్నవారికి డ్రగ్స్‌ టెస్ట్‌ చేయించారు. అందులో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ ఎవరిచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగీ పనిలోపడ్డారు.

ఇదికాకుండా దుర్గం చెరువు సమీపంలోని ఓ పబ్‌లోనూ పోలీసులు సోదాలు చేసినట్టు వార్తలు వస్తున్నా యి. అందులో ఎవరైనా డ్రగ్స్‌ తీసుకున్నట్లు దొరికారా? లేదా అన్నది తెలియాల్సివుంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10