AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి..: కేసీఆర్‌

తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాటపంథాలో దాశరథి అందించిన స్ఫూర్తి ఇమిడి వున్నదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా ‘తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. దాశరథి అని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భబిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.

ANN TOP 10