AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోదావరి ఉధృతం.. 40.5 అడుగులకు చేరిన నీటిమట్టం

ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తున్నది. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్నది. తాజాగా భద్రాచలం వద్ద నీటిమట్టం 40.5 అడుగులకు పెరిగింది. నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగితే వరద పెరిగే అవకాశం ఉన్నది.

ఇదిలా ఉండగా.. 1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్ఠంగా గోదావరికి 75.60 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు. 2022లో కురిసిన జోరువానకు 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది. మరో వైపు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండగా తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతున్నది. ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్ల ద్వారా 55,232 క్యూసెక్కుల వరదను గోదావరి నదిలోకి వదులుతున్నారు.

ANN TOP 10