AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) గోదావరి నది(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పై నుంచి ప్రవహిస్తున్నది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా,తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుం డటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ఇప్పుడు 7.645 టీఎంసీలు ఉన్నాయి.

ANN TOP 10