AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినీనటి ఆకాంక్ష ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో విషాదం..
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) మరణించారు. వారణాసిలోని సారనాథ్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్‌లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఆకాంక్ష ‘మేరా జంగ్ మేరా ఫైస్ల’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకున్నారు. అనంతరం వరుసగా ఛాన్స్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్నారు. చిత్రీకరణ ముగిసిన అనంతరం హోటల్‌లోని గదిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేశారు.

ఆకాంక్ష దూబే ఉత్తరప్రదేశ్‌లోని పార్సిపూర్‌కు చెందినవారు. భోజ్‌పురి ఇండస్ట్రీలో మంచి నటిగా ఆమె గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక సినిమాలు చేశారు. వీరోంకే వీర్, ఫైటర్ కింగ్ తదితర చిత్రాల్లో నటించారు. నటుడు సమర్ సింగ్ (Samar Singh)తో ఆకాంక్ష సహజీవనం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమను అధికారికంగా వెల్లడించారు. భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్‌తో ఆమె ఓ పాటను చేశారు. ఆ సాంగ్ విడుదలైన మార్చి 26నే ఆమె మరణించారు.

ANN TOP 10