భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి పిడుగు పడి(Lightning) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామ చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా,రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలోని చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరడంతో రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఈదురు గాలుల కు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. ప్రధాన రహదారిపై పైకి మూడు అడుగుల మేర వర్షం నీరు చేరడటంతో చర్ల, దుమ్ము గూడెం మండలాల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడే సమసమయ్యంలో చెట్ల కింద ఉండకూడదని, అవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దన్నారు.