AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సులో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్ అరెస్ట్

బస్సులో ప్రయాణిస్తున్న ఓ యవతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్టీసీ బస్ కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఇతర వార్తా కథనాల ప్రకారం.. ఫరూక్ నగర్ డిపోకు చెందిన బస్సులో ఓ యువతి పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్‌కు ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో మణికొండ వద్ద బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక కండక్టర్ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదంటూ అందులో పేర్కొన్నది. సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

ఆ యువతి పోస్ట్‌పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కండక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. అనంతరం కండక్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారంటూ అందులో పేర్కొన్నారు.

ANN TOP 10