రైతుల్లో హర్షాతిరేకాలు
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
(అమ్మన్యూస్, హైదరాబాద్)
రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అంశాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రేపు మొదటిసారి లక్ష రూపాయలు వరకు రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వపరంగా ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు రేపు జమ చేయనుంది.
నెలాఖరు లోగా లక్షన్నర రూపాయలు రుణం తీసుకున్న రైతులందరినీ రుణ విముక్తుల్ని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.అదే విధంగా ఆగస్టు 15వ తేదీ లోపల రెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, పిసిసి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్, గౌరీ సతీష్ తదితరులు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు.