AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతును రాజును చేస్తాం.. మంత్రి పొంగులేటి

ఆర్థికంగా బలోపేతం చేసేందుకే రుణమాఫీ
వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలి

(అమ్మన్యూస్,హైదరాబాద్‌):
రైతులు దేశానికి వెన్నెముక. రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే దృఢ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతు సోదరులు ఆర్థికంగా బలపడడానికి రైతాంగానికి ఎల్లవేళలా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందు కే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నదన్నారు.

వ్యవసాయ రంగం బాగుంటేనే..
మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బాగుంటుందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి మించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి మరొకటి లేదు. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుందన్నారు. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి పంట రుణ మాఫీ పథకం ద్వారా రైతన్నలకు మంచి ప్రారంభం లభించిందన్నారు. జూలై 18వ తేదీన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నామని, ఆ రోజు సాయంత్రం వరకు రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ANN TOP 10