AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి.. సీఎం రేవంత్‌ విచారం.. కీలక ఆదేశాలు

చర్యలకు ఆదేశం
అధికారులకు దిశానిర్దేశం

(అమ్మన్యూస్, మేడ్చల్‌):
మేడ్చల్‌ జవహర్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌ విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను చాలా కలిచివేసిందన్నారు. వీధి కుక్కల దాడుల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు విచక్షిణారహితంగా దాడి చేశాయి. శరీరం మెుత్తం తీవ్ర గాయాలు కావటంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. బుధవారం ఇవాళ ఉదయం పరిస్థితి విషమించి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. చిన్నారి చనిపోయిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్‌ సెంటర్‌ లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పసి కందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కలు దాడులకు పాల్పడటానికి వాతావరణ పరిస్థితులు కారణమా.. లేక సీజనల్‌ కారణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్‌ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10