భూకబ్జాలు, బెదిరింపులకు కేరాఫ్ అడ్రస్
పోలీసులపై దాడులు చేయడం మీకే చెల్లింది
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ను విమర్శిస్తే ఖబడ్డార్
కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్‌లో బీజేపీ నాయకుల వ్యవహారశైలిపై ఆగ్రహం
ఆదిలాబాద్: ఎమ్మెల్యే పాయల్ శంకర్ జీవితమే మోసలమయమని, భూకబ్జాలు, బెదిరింపులు, నయవంచన
కు ఆయన కేరాఫ్ అడ్రస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అండ చూసుకుని బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నతీరుపై ఫైర్ అయ్యారు. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది వారి దౌర్జన్యానానికి పరాకాష్టగా అభివర్ణించారు.
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ను విమర్శించే స్థాయి కాదంటూ హితవు పలికారు. ఆయన జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే దుందుడుకు చర్యను, వ్యవహారశైలిని ఖండించారు. బీజేపీని విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నిస్తుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌ను పట్టుకుని ప్యారాచూట్ లీడర్ అనడం సరికాదన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, అవగాహనా రాహిత్యంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. 2006లోనే కిరణ్‌కుమార్ జాతీయ రాజకీయాల్లో చేరి కాంగ్రెస్‌లో వివిధ విభాగాల్లో విశేష సేవలు అందించారన్నారు.
వ¯Œ టైం వండర్‌గా ఎన్నికైన శంకర్ ఆయన్ను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేదిలేదని అన్నారు. నిఖార్సైన కాంగ్రెస్ బిడ్డగా, యువతకు ఆదర్శమైన లీడర్‌గా కిరణ్‌కుమార్ ఎదిగారన్నారు. మీలా అవినీతి నేత కాదంటూ సెటైర్ వేశారు. పాయల శంకర్ జీవితమే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, నయవంచన, బెదిరింపులు అంటూ వ్యాఖ్యనించారు. మాజీ ఎమ్మెల్యే, మంత్రి జోగు రామన్నకు అనేక విధాలుగా సహకరించిన మీ వ్యవహారం అందరికీ తెలిసిందేనన్నారు. తమ పార్టీ ఎంపీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఆ భయంతోనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.