AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై సుప్రీంలో కేసీఆర్ పిటిషన్.. 15న విచారణ..!

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయమై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తనకు పంపిన సమన్లపై రాష్ట్ర హైకోర్టు ఈ నెల ఒకటో తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించనున్నది. జస్టిస్ నరసింహారెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.

ANN TOP 10