AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్‌పై కాల్పులకు పాల్పడింది ఈ గన్‌తోనే..

వెలుగులోకి సంచలన విషయాలు..
(అమ్మన్యూస్, పెన్సిల్వేనియా):
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం అగ్రరాజ్యంలో కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్‌ చెవికి రాసుకుంటూ వెళ్లడంతో ట్రంప్‌ త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ట్రంప్‌పై దాడితో ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యి ఒక నిందితుడిని స్పాట్లోనే కాల్చి చంపారు. ట్రంప్‌పై మర్డర్‌ అటెంప్ట్‌ నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్‌ ప్రకటించారు. పెన్సిల్వేనియా బట్లర్లో ట్రంప్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చుట్టుముట్టాయి.

ఆ ప్రాంతంలోని బిల్డింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీక్రెట్‌ సర్వీస్‌ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఆర్‌–15 సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌ తో కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. 182 మీటర్లు దూరం నుంచి ఫైరింగ్‌ జరిపినట్లు గుర్తించారు. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభావేదికకు ఎదురుగా ఉన్న ఎతై ్తన ప్రదేశం నంచి∙కాల్పులు జరిపిన దుండగుడు.. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ట్రంప్‌ ఘటనపై విచారణను అమెరికా సీక్రెట్‌ సర్వీసెస్‌ స్పీడప్‌ చేశాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10