(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ట్రంప్‌పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుతున్నా’ అని కాంగ్రెస్ నేత, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదన్నారు.
ఉలిక్కిపడిన అమెరికా..
ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన సంఘటన ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలనంగా మారింది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ గాయాల పాలయ్యారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను ఆస్పత్రికి తరలించారు.