గద్వాల జిల్లాలోని ఓ పాఠశాలలో పాము కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులను కాటు వేయడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీసు వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాళలకు చెందిన ముగ్గురు విద్యార్థులను పాము కరిచింది. శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురిని పాము కాటేసింది.
శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్న మైనర్ బాలుడు అనిల్ కుమార్, కేటి దొడ్డి మండలంకు చెందిన సంతోష్ నాయక్, ఐజ మండలంకు చెందిన అర్జున్ కుమార్, గద్వాలకు చెందిన వీరేంద్ర చార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకుని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వదిలారు. ఈ నలుగురు విద్యార్థులు శనివారం మూత్ర విసర్జనకు బయటకు వెళ్లారు. అక్కడ పాముకాటుకు గురికావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని వైద్యలు తెలిపినట్లు సమాచారం.
విద్యార్థినులను కరిచిన ఎలుకలు..
అదేవిధంగా.. మెదక్ జిల్లా రామాయంపేటలోని గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన మరువక ముందే మెదక్ జిల్లా నర్సాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గురుకులంలోనూ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకులంలో విద్యనభ్యసిస్తున్న నలుగురిని శుక్రవారం ఎలుకలు కరిచినట్లు ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు.
– Advertise