AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి..

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవం నేపథ్యంలో, నేడు అతి ముఖ్యమైన అతిథులకు అంబానీ కుటుంబం ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో విందు ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లను చంద్రబాబు ఆశీర్వదించారు. ముఖేశ్ అంబానీ స్వయంగా తన కుమారుడు, కోడలిని చంద్రబాబు దంపతులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి కూడా ఈ రిసెప్షన్ కు విచ్చేశారు. నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ లతో చంద్రబాబు ముచ్చటించడం ఓ వీడియోలో కనిపించింది. ఈ రిసెప్షన్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఫిఫా అధ్యక్షడు గియాన్నీ ఇన్ఫాంటినో వంటి ప్రపంచ ప్రముఖులు సైతం అంబానీ ఇంట సంబరాలకు హాజరయ్యారు.
.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10