AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గన్‌ మిస్‌ ఫైర్‌.. అపార్టుమెంట్‌లోకి దూసుకొచ్చిన బుల్లెట్‌

హైదరాబాద్‌లోని నార్సింగిలో కలకలం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైదరాబాద్‌ నార్సింగిలో బుల్లెట్‌ కలకలం రేగింది. గన్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో ఓ అపార్ట్‌ మెంట్‌లోకి బుల్లెట్‌ దూసుకొచ్చింది. ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్‌ చేసే సమయంలో మిస్‌ ఫైర్‌ అయింది. దీంతో ఏకంగా ఆ బుల్లెట్‌ పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో దూసుకెళ్లడంతో ఐదో అంతస్తులో అద్దాలు ధ్వంసమయ్యాయి. నార్సింగిలోని బైరాగిగూడలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి బుల్లెట్‌ దూసుకురావడంతో ఆ ప్లాట్‌ యజమానితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో జరిగిన ఈ ఘటనపై ఇంటి యజమాని స్పందించాడు. కిటికీలోంచి ఓ బుల్లెట్‌ నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిందని వెల్లడించాడు. ఒక్కసారిగా అద్దాలు పగలడంతో భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. మా కుటుంబ సభ్యులు బుల్లెట్‌ చూసి వణికిపోయారని చెప్పాడు.

ఈ విషయంపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు యజమాని వెల్లడించాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు ఇంట్లోకి వెళ్లి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ANN TOP 10