AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ను కాళ్లకింద పడేసి తొక్కినా.. మీ అహంకారం ఇంకా తగ్గలేదు..

కేటీఆర్‌పై టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ ఫైర్‌

(అమ్మన్యూస్, అమరావతి):
టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ కేటీఆర్‌పై విమర్శల దాడికి దిగారు. బుధవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా, కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం ఇంకా తగ్గలేదని ఫైర్‌ అయ్యారు. జగన్‌ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు ఆశించారని అన్నారు. చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే కేటీఆర్‌ కొంప ముంచిందని గుర్తుంచుకోండని చురకలు అంటించారు.

సోమిరెడ్డి ట్విట్టర్‌లో.. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో తండ్రి ఫామ్‌ హౌస్‌ కు, కొడుకు కలెక్షన్‌ హౌస్‌ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్‌ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్‌ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి కేటీఆర్‌’.. అంటూ రాసుకొచ్చారు.

ANN TOP 10