AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంతగూటికి బీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు, BRS రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా DSకు సీనియర్‌ నేతలు వీహెచ్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి పాల్గొన్నారు. డీఎస్‌తో పాటు ఆయన కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుsకు వీల్‌ ఛైర్‌లో గాంధీభవన్‌కు డీ. శ్రీనివాసరావు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో ముచ్చటించారు.

వాస్తవానికి తాను పార్టీలో చేరడం లేదని, తన కుమారుడు చేరుతున్నాడని డీ శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఒక లేఖ విడుదల చేశారు. ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్‌కు వెళ్లి సంజయ్‌ని ఆశీర్వదిస్తానని లేఖలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆ లేఖలో DS రాశారు. కాని, కాసేపటికే ఆయన వీల్‌ ఛైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చారు. అదే సమయంలో ప్రజాక్షేత్రంలో నా మరో కుమారుడు అరవింద్‌ మంచి పేరు తెచ్చుకుంటున్నారని ధర్మపురి శ్రీనివాస్‌ అన్నారు.

ANN TOP 10