టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఆయన హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తన నివాసం వరకు చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయనకు అడుగడున అభిమానులు స్వాగతం పలికారు.
ఇందుకు కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలతో ఈ రూటు పసుపు మాయంగా మారింది. రోడ్డు మార్గంలో ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు నాయుడు ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నగర వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.ఇక శనివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ సీఎం భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రులిద్దరు చర్చించనున్నారు. దీంతో ఇద్దరి భేటీపై ఉత్కంఠ నెలకొంది.