AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.

మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ పై కోహ్లి అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ‘ఇదే నా చివరి వరల్డ్ కప్.. అలాగే టీ20 మ్యాచ్ కూడా’ అంటూ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్ధేశంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు.

ANN TOP 10