AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్‌.. మొక్కులు తీర్చుకున్న ఏపీ డిప్యూటీ సీం

పూర్ణకుంభంతో స్వాగతం
పోలీసుల భారీ బందోబస్తు

(అమ్మన్యూస్, జగిత్యాల):
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయస్వామిని శనివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఎన్నికల ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్‌ పూజలు నిర్వహించారు. పవన్‌ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు సిద్ధిపేటలో పవన్‌ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్‌ అభివాదం చేశారు.

దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం..
అంతకుముందు కొండగట్టుకు బయల్దేరిన పవన్‌కు దారిపొడవునా అభిమానుల ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం పలికారు. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు వీరఖడ్గం అందించారు.

ANN TOP 10